సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు రివ్యూ

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ వంటి హ్యాట్రిక్ హిట్స్ ని సొంతం చేసుకొని కెరియర్ ని జెట్ స్పీడ్ తో నడిపిస్తున్న రాజ్ తరుణ్ నుండి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రేజీ చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం లో శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం…

కథ :

అదో అందమైన పల్లెటూరు అందులో సీతామాలక్ష్మి (అర్తన) , శ్రీరామ్ (రాజ్‌తరుణ్) చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరుగుతారు..మన శ్రీరామ్ కు మాత్రం సీతామాలక్ష్మి అంటే అమీతమైన ప్రేమ.. కానీ శ్రీరామ్ అల్లరి చిల్లర గా తీరగడంతో సీతామాలక్ష్మికి నచ్చదు..ఆయన కానీ తానని ప్రేమంచమని వెంటపడుతుంటాడు…మనోడి చేష్టలకు ఎలాగో అలాగా ప్రేమలో పడుతుంది…అదే ఊరికి ప్రెసిడెంట్ గా సీతామాలక్ష్మి తండ్రి (రాజా రవీంద్ర) కి వీరి ప్రేమ తెలియడం తో , సీతామాలక్ష్మికి పెళ్లి సంబందం చూస్తాడు..ఇండియా క్రికెట్ టీం కు సెలెక్ట్ అయిన ఆదర్ష్ ను సీతామాలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేయాలనీ అనుకుంటాడు..ఈ లోపు శ్రీరామ్ వెళ్లి ఆదర్ష్ కు తమ ప్రేమ వ్యవహారం చెపుతాడు..అయితే ఆదర్ష్ మాత్రం తనతో క్రికెట్ ఆడి గెలిచి సీతామాలక్ష్మి సొంతం చేసుకొమ్మని పందెం వేస్తాడు..పందెం కు సై అన్న శ్రీరామ్ గెలుస్తాడా లేదా..? సీతామాలక్ష్మి ఎలా దక్కించుకుంటాడు..? అనేది మిగతా స్టొరీ…

ప్లస్ :

రాజ్ తరుణ్ యాక్టింగ్..
షకలక శంకర్ కామెడీ..
మ్యూజిక్ పర్వాలేదు..
ఫోటోగ్రఫీ…

మైనస్ :

రొటీన్ స్టొరీ
క్లైమాక్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

రాజ్‌తరుణ్ ఎప్పటిలాగానే తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.. అర్తన ఈ చిత్రం తో తొలిపరిచయం అయిన ఉన్నతలో కాస్త ఆకట్టుకుంది.. హీరోయిన్ తండ్రి గా అలాగే ఆ ఊరికి ప్రెసిడెంట్ గా రాజా రవీంద్ర బాగానే ఆకట్టుకున్నాడు..ముఖ్యంగా షకలక శంకర్ కామెడీ థియేటర్స్ లలో ఈలలు వేయించింది.. మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి మిగతా నటినటులు వారి పాత్ర మేరకు బాగానే ఆకట్టుకున్నారు..

సాంకేతిక విభాగం :

ముఖ్యంగా గోపీసుందర్ అందించిన మ్యూజిక్ బాగుంది, అలాగే పల్లెటూర్ బ్యాక్ డ్రాప్ స్టొరీ కి ఏలాంటి బ్యాక్ గ్రౌండ్ అయితే బాగుంటుందో ఆది ఇచ్చి సక్సెస్ అయ్యాడు..అలాగే సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య రాసిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి..

కెమరా విషయానికి వస్తే విశ్వ చాల అద్భుతంగా తన పనితనాన్ని నిరూపించాడు..హీరో , హీరోయిన్ లను లగే పల్లెటూర్ అందాలను చాల చక్కగా తెరకెక్కించాడు..అక్కడక్కడ కాస్త బోర్ కొట్టించిన కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు.. దర్శకుడి గా మొదటి చిత్రం అయిన శ్రీనివాస్ గవిరెడ్డి ఎంచుకున్న కథ మాత్రం పాతదే…హీరో పందెం లో గెలిచి హీరోయిన్ ని సొంతం చేసుకోవడం వంటివి చాల సినిమాల్లో మనం ఇప్పటికే చూసాం..కాకపోతే స్క్రీన్‌ప్లే తో జాగ్రత్త పడ్డాడు..

చివరిగా :

వరుస హిట్స్ తో దూసుకపోతున్న రాజ్ తరుణ్ మరో పల్లెటూరు లవ్ స్టొరీ ఎంచుకొని సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు..కథ పాతదే అయిన కామెడీ , సాంగ్స్ కొత్తగా ఉండడం , ప్రస్తుతం తరుణ్ క్రేజ్ లో ఉండడం తో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు గట్టేక్కిందని చెప్పవచ్చు..దర్శకుడికి మొదటి చిత్రం అయిన సక్సెస్ కొట్టాడు..మొత్తానికి సీతమ్మ అందాలు చూడడం లో రామయ్య సక్సెస్ అయ్యాడు.

2 COMMENTS

LEAVE A REPLY