తెలంగాణలో మున్సిపల్ కార్మికులకు శుభవార్త…?

n4d_KTR

వారి జీతాలపెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. జీతాలు పెంచితే మున్సిపాలిటీలపై ఎంత భారం పడుతుందన్నదానిపై నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్మికులతో ఇళ్లల్లో పనిచేయించుకునే అధికారులు, ప్రజా ప్రతినిధులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. వారికి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జీతాల పెంపుపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. కార్మికుల ఆరోగ్యపరిరక్షణ కోసం ఒక హెల్త్ కార్డును తీసుకువచ్చే అంశాన్ని పరిశీలంచాలని అధికారులకు సూచించారు.

NO COMMENTS