‘ట్రంప్ ఓ రోగ్, ఓ గ్యాంగ్‌స్టర్ – కిమ్

n4d_kim-trump

ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియాపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కిమ్ తీవ్రంగా తప్పుపట్టారు. డోనాల్డ్ ట్రంప్‌కు పట్టిన పిచ్చిని వదిలిస్తానని కిమ్ అన్నారు. తమ దేశానికి అణ్వాయుధాలు అభివృద్ధి చేసే హక్కు ఉందన్నారు. ఉత్తరకొరియా ఇటీవల పదేపదే క్షిపణి ప్రయోగాలు, అణుపరీక్షలతో టెన్షన్ పుట్టిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అమెరికా నేలను టార్గెట్ చేసే విధంగా కూడా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తోంది. దీంతో అమెరికా, ఉత్తరకొరియా మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ఉత్తర కొరియాను నాశనం చేస్తానన్నారు. ‘రాకెట్ మ్యాన్ కిమ్ ఓ సూసైడ్ మిషన్ మీద ఉన్నాడు’ అంటూ ట్రంప్ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కిమ్ శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు.

ప్రపంచ దేశాల ముందు ఉత్తరకొరియాను ట్రంప్ అవమానించారని, తమపై యుద్ధం చేసి నాశనం చేస్తానని అన్నారని, ఆ పిచ్చి మాటలకు ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. అంతేకాదు, ఉత్తరకొరియా అధినేత కిమ్ తన వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షుడిని దునుమాడారు. ”ట్రంప్ ఓ రోగ్.. ఓ గ్యాంగ్‌స్టర్.. అతను రాజకీయవేత్త కానే కాదు అని కిమ్ వ్యాఖ్యానించారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందర్నీ బెదిరిస్తున్నాడని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, సుప్రీమ్ కమాండర్‌గా పనికిరాడు..” అని ట్రంప్‌ను ఉద్దేశిస్తూ కిమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడులతోనే ఆ ముసలి ట్రంప్ తిక్క కుదురుస్తానని కిమ్ హెచ్చరించారు.

NO COMMENTS