జ్యోతి కిరణ్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు

n4d_acb-raids-jyothi-kiran

ఆదాయనికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ లోని ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ లో ఉన్న ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ ను అధికారులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. హైదరాబాద్ బాగ్ అంబర్ పేట్ లోని నివాసంలో సోదాలు చేస్తోన్న అనిశా అధికారులు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. కిలోకు పైగా బంగారు ఆభరణాలు, 13 ఇళ్ల స్థలాలు, రెండు ఇళ్లు, జహీరాబాద్ లో 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.

NO COMMENTS