లాస్ వెగాస్‌లో కాల్పులు, ఇద్దరు మృతి ..!

n4d_shooter

అమెరికాలోని క్యాసినో నగరం లాస్ వెగాస్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. మండలే బే హోటల్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తున్నది. కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ వ్యక్తి కాల్పులకు దిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి వేల సంఖ్యలో జనం పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ అయ్యాయి. అయితే గన్ పేల్చిన శబ్ధాలు కొన్ని వీడియోల్లో వినిపిస్తున్నవి. షూటింగ్ జరిగిన ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులు ఉన్నారు. గన్ కాల్పుల వల్ల కలిగిన గాయాలతో అనేక మంది హాస్పటళ్లకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం ప్రకారం కాల్పుల వల్ల ఇద్దరు మృతిచెందారు.

NO COMMENTS