ఐటీ కంపెనీలకు అమెరికా గుడ్‌న్యూస్‌

h1bvisa

అన్ని రకాల హెచ్‌-1బీ వీసా పిటిషన్ల ప్రీమియం ప్రాసెసింగ్‌ పునఃప్రారంభిస్తున్నట్టు యూఎస్‌సీఐఎస్‌ మంగళవారం ప్రకటించింది. ఇటీవలే కొన్ని విభాగాల్లో హెచ్‌-1బీ వీసాల ప్రీమియం ప్రక్రియను పునఃప్రారంభించిన యూఎస్‌సీఐఎస్‌, ప్రస్తుతం అన్ని విభాగాలకు ఈ ప్రక్రియను పునరుద్ధరించింది. భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో గత ఏప్రిల్‌లో ట్రంప్‌ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ వీసాల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. పిటిషనర్‌, ఏజెన్సీ ప్రీమియం ప్రాసెసింగ్‌ సర్వీసును కోరితే, యూఎస్‌సీఐఎస్‌ 15 రోజుల్లోగా వీసా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటుందని, ఆ లోపు మంజూరు కాకపోతే ఏజెన్సీ పిటిషనర్‌ ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫీజును వెనక్కి ఇచ్చేయనున్నట్టు పేర్కొంది. హెచ్‌-1బీ వీసాల ప్రాసెసింగ్‌కు ప్రీమియం ప్రాసెసింగ్‌ తత్కాల్‌ స్కీమ్‌ లాంటిదని, 15 రోజుల్లో అప్లికేషన్‌ ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. దీనికి ఒక్కో అప్లికేషన్‌కు అ‍య్యే ఖర్చు 1,225 డాలర్లుగా యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.

NO COMMENTS