వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతికు నాన్ బెయిలబుల్ వారెంట్..!

n4d_jagan-bharathi

జగన్ మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి ఆమె తో పాటు సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి లని ఈ నెల 16 లోగా అరెస్ట్ చేసి కోర్టు లో హాజరుపరచాలి అంటూ నూజివీడు కి చెందిన రెండవ అడిషినల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసారు. సాక్షి మీడియా సంస్థల కి వైఎస్ భారతీ రెడ్డి చైర్మన్ గా ఉంటున్నారు. గత నెల 26న న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయగా, అవి అధికారికంగా హనుమాన్ జంక్షన్ పోలీసుల చేతికి బుధవారం నాడు వచ్చినట్టు తెలుస్తోంది. గత సంవత్సరం సాక్షి పత్రికలో విజయ డెయిరీ డైరెక్టర్ చలసాని ఆంజనేయులుపై ఓ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. దీనిమీద ఆయన పరువు నష్టం దావా వేసారు భారతి , రామచంద్రమూర్తి తరఫున ఏ న్యాయవాది వకాల్తా దాఖలు చెయ్యలేదు వెంటనే వారికి సంబంధించి వారెంట్లు బయటకి వచ్చాయి. ఇక వీటిపై జిల్లా ఎస్పీ, డీజీపీలతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

NO COMMENTS