భారత పర్యటనలో మాకు నిరాశే – స్మిత్

n4d_kohli-smith

టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్ నుంచి గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఎమోషనల్ మెసేజ్ ను షేర్ చేసుకున్నాడు. వన్డే సిరీస్ లో ఘోర పరాభవాన్ని, ఆపై తొలి ట్వంటీ 20లో ఓటమిని దగ్గరుండి వీక్షించిన స్మిత్ ఆస్ట్రేలియాకు పయనమవుతూ ఒక ఉద్వేగభరిత సందేశాన్ని తన  ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వరుస విజయాలతో భారత్ ఆనందంగా ఉంది. భారత పర్యటనలో మాకు నిరాశే మిగిలింది. భారత్ పై దారుణ పరాభవం మాకు కొన్ని చేదు జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. మమ్మల్ని దురదృష్టం కూడా వెంటాడింది. ఇక కొద్ది పాటి విశ్రాంతి తీసుకుంటూ ఆటగాళ్ల పునరావస శిబిరంలో పాల్గొంటూ గాయం నుంచి కోలుకోవడానికి యత్నిస్తా. మిగతా టీ 20ల్లో మా అదృష్టం మారుతుందేమోనని ఆశతో ఎదురుచూస్తూ ఉంటా అని స్మిత్ పేర్కొన్నాడు.

NO COMMENTS