కడప జిల్లా (వేంపల్లె): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

n4d_murder-or-sucide

వేంపల్లె: జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాల సమీప ఇంట్లో వరమ్మ (33) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.  పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బ్రహ్మంగారిమఠం సిద్దయ్యగారిమఠం సమీప మడిమాల వాసి సుధాకర్‌కు, బ్రహ్మంగారి మఠం నెరసంపల్లెకు చెందిన వరమ్మతో 12 ఏళ్ల కిందట వివాహమైంది. వంటపనిచేసే సుధాకర్‌ వేం పల్లెలోని స్టార్‌హోటల్‌లో పనిచేస్తున్నాడు. మూడు నెలల నుంచి స్థానిక జడ్పీ బాలికల హైస్కూల్‌ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. భర్త రోజూ తాగి వస్తాడని ఈ విషయంలో భార్య గొడవపడేదని స్థానికులు చెబుతున్నారు. బుధవారం రాత్రి కూడా భార్యభర్తలు గొడవపడ్డట్లు తెలిసింది. గురువారం ఉదయం మృతిచెంది ఉన్న విషయాన్ని స్థానికుల ద్వారా పోలీసులకు తెలిసింది. ఎస్‌ఐ నరేంద్రకుమార్‌, పోలీసు సిబ్బంది వెళ్లి పరిశీలించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా భర్తే ఏమైనా చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వేకువజామున నిద్రలేచి చూడగా భార్య మృతిచెంది ఉందని భర్త పోలీసుల కు వివరించినట్లు తెలిపారు.

NO COMMENTS