ఏప్రిల్ 27న మహేశ్ ప్రమాణ స్వీకారం..!

n4d_mahesh

ప్రిన్స్ మహేశ్ బాబు-కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నెక్ట్స్ వస్తున్న భరత్ అనే నేను సినిమాపై కూడా అంచనాలకు రెక్కలొచ్చేశాయి. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మొదటిసారిగా మహేశ్ సీఎంగా నటిస్తున్నారు. షూటింగ్ పరంగా సీఎంగా మహేశ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగినా ప్రేక్షకుల సాక్షిగా జరిగే డేట్ తెలిసిపోయింది. అంటే రిలీజ్ డేట్ ఎప్పుడో తెలిసిపోయింది.  వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో మహేశ్ సరసన కైరా అద్వాని నటించనుంది.

NO COMMENTS