ఫీల్డింగ్ ఏర్పాటులో బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ నిచ్చా – కోహ్లి

n4d_kohli

న్యూజిలాండ్ తో చివరిదైన మూడో వన్డేలో విజయం సాధించడంలో బౌలర్లకు తగినంత స్వేచ్ఛనిచ్చినట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లి మ్యాచ్ ఉత్కంఠగా మారిన తరుణంలో ఫీల్డింగ్ ఏర్పాటులో బౌలర్లకు స్వేచ్ఛ నిచ్చినట్లు స్పష్టం చేశాడు. ‘సిరీస్ లో జరిగిన మూడు మ్యాచ్ ల్లో కివీస్ గట్టిపోటీ ఇచ్చింది. దీంతో మేము అత్యుత్తమ ఆటను ప్రదర్శించే అవకాశం దక్కింది. ఈ రకంగా న్యూజిలాండ్ మా ఆటను బయటకు తీయడానికి సహకరించింది.  ఆ క్రెడిట్ అంతా న్యూజిలాండ్ దే. అందుకే నేను కూడా బౌండరీ లైన్ వద్దే ఉన్నా. బౌలర్లపై ఎటువంటి ఒత్తిడి తీసుకురాకుండా ఫీల్డింగ్ కు సహకరించా. నా లక్ష్యం ఒక్కటే. మ్యాచ్ గెలిచి సిరీస్ దక్కించుకోవాలి. ఎలాంటి స్థితిలోనైనా జట్టు విజయం సాధించాలనే భావించా. సిరీస్ నిర్ణయించే మ్యాచ్ లో శతకం సాధించడం సంతోషంగా ఉంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో గెలుపొందడం ఒక మధురానుభూతిని మిగిల్చింది’అని కోహ్లి పేర్కొన్నాడు.

NO COMMENTS