ఇంత చెత్త సచివాలయం ఏ రాష్ట్రానికి లేదు – కేసీఆర్

n4d_KCR

తెలంగాణ అసెంబ్లీ ఇవాళ కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్యంగా సెక్రటేరియట్ భవనం తరలింపుపై ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఇందుకు సమాధానంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఇంత చెత్తగా ఉన్న సచివాలయం ఏ రాష్ట్రానికే లేదన్నారు. చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా తప్పక చెప్పాల్సి వస్తోంది.. దేశంలోనే ఇంత చెత్త సచివాలయం ఎక్కడా లేదని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. సచివాలయాన్ని ఇష్టారీతిన నిర్మించారని సీఎం అన్నారు. ఫైరింజన్‌ తిరగడానికి కూడా అనుకూలంగా లేదన్నారు. సచివాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌ సదుపాయం సరిగా లేదని కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీలో కనీసం కారు పార్కింగ్‌కు కూడా స్థలం లేదన్నారు. బైసన్‌ పోలో గ్రౌండ్‌ క్రీడాస్థలం కాదని అసెంబ్లీలో కేసీఆర్‌ వివరించారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సర్కార్‌కు సూచించగా ఇందుకు సీఎం బదులిస్తూ మేమేం ఎస్సీ హాస్టల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వట్లేదా..? దేశంలో ఎక్కడా, ఎవరూ ఇవ్వని ప్రాధాన్యతను టీఆర్ఎస్ సర్కార్ ఇస్తోందన్నారు. 504 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఎస్సీలకు ప్రత్యేకంగా చట్టం తెచ్చాం.. చట్టాన్ని అమలుచేస్తున్నామన్నారు.

NO COMMENTS