100 కోట్ల బడ్జెట్‌తో హిరణ్యకశ్యప…

n4d_gunasekhar

రుద్రమదేవి సినిమాతో భారీ చారిత్రక చిత్రాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన దర్శకుడు గుణశేఖర్‌ ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ప్రహ్లాదుడి కథతో హిరణ్యకశ్యప అనే సినిమాను తెరకెక్కించనున్నట్టుగా గుణశేఖర్‌ ఇటీవల ప్రకటించాడు. అంతేకాదు యంగ్‌ హీరో రానా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. హిరణ్యకశ్యప సినిమాను దర్శకుడు గుణశేఖర్‌ దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. అయితే మార్కెట్‌ పరంగా గుణశేఖర్‌గాని, రానా గాని ఇంతవరకు వంద కోట్లమార్క్‌ను అందుకోలేదు. అందుకే అంత బడ్జెట్‌తో హిరణ్యకశ్యపను తెరకెక్కించటం సాహసమే అని భావిస్తున్నారు విశ్లేషకులు.

NO COMMENTS