ఇలియానా: చనిపోదామని అనుకున్నాను

n4d-ilena

గోవా బ్యూటీ ఇలియానా ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమంకి హాజరైన ఈ భామ తన జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి వివరించింది. తన శరీరం గురించి పలువురు పలు రకాల కామెంట్స్ చేసినప్పుడు తాను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఒకానొక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలని భావించిందట. కాని అంతలోనే తనకి తానే ధైర్యం చెప్పుకొని నార్మల్ స్టేజ్ కి వచ్చానని చెబుతోంది ఇలియనా. డిప్రెషన్ నుండి బయటపడాలంటే ముందుగా మనకు మనం ధైర్యం తెచ్చుకోవాలని అంటుంది గోవా బ్యూటీ. డిప్రెషన్ లోకి వెళ్లినప్పుడు వెంటనే వైద్యులని సంప్రదించాలి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటుంది. నటీమణులు అందంగా కనిపించడానికి రెండు గంటల సమయం పడుతుంది, కాని మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మేకప్ లు లేకుండా చాలా గ్లామర్ గా కనిపిస్తారని వివరించింది. ఇలియానా వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమంలో ఉమెన్ ఆఫ్ సబ్ స్టెన్స్ అనే అవార్డు అందుకుంది.

NO COMMENTS