హ్యాపీ బర్త్ డే. స్వీటీ బ్యూటీ(అనుష్క)

n4d-anushka

అందం అభినమయం కలగలిపిన ముగ్ధమనోహర రూపం అనుష్క. ‘సూపర్’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. టైటిల్ కు దగ్గట్టే వెండితెరపై తన వెలుగులను వెదజల్లింది. కెరీర్ ప్రదమార్ధంలో సగటు హీరోయిన్ లానే అనుష్క కూడా సో సో గానే సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. గ్లామర్ పాత్రల్లో అదరగొట్టేసింది. ఈ దశలో ఆమె నుండి వరుసగా గ్లామర్ పాత్రలు పుట్టుకొచ్చాయి.
అయితే అనుష్క సినీ ప్రయాణాన్ని ఓ మలుపు తిప్పేసిన చిత్రం ‘అరుంధతి’. ఈ సినిమాతో అభినయం పరంగా ఒక్కసారి వందమెట్లు ఎక్కేసింది అనుష్క. అప్పటివరకూ సగటు హీరోయిన్ లా కనిపించిన అనుష్క .. ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళిపోయింది. ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా రికార్డు సృష్టించడమే కాదు.. జేజమ్మ లాంటి పాత్రల్లో ఆమె ఒదిగిన తీరు అందర్నీ కట్టిపడేసింది.అప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లో మెప్పించిన అనుష్క ఒక్కసారిగా జేజమ్మ అవతారం ఎత్తే సరికి యాక్టింగ్ పరంగా ఆమెకున్న క్యాలిబర్ చూసి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. అప్పటి నుంచీ ‘అందం అభినయనం ‘కలగలిపిన రూపం అనుష్క అని పేరు తెచ్చుకుంది స్వీటీ. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘వేదం’కూడా ఆమె నటనలోని మరో కోణాన్ని చూపింది. ఇందులో అమలాపురం సరోజగా.. ఆమె కనబరిచిన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వేదం తర్వాత మరిన్ని కమర్షియల్ సినిమాల్లో అలరించింది అనుష్క.
తర్వాత కాలంలో రుద్రమదేవి గా మెస్మరైజ్ చేసింది. ఇక బాహుబలిలో దేవసేనగా మరోసారి అనుష్క నట విశ్వరూపం చూపించింది అనుష్క. ఇప్పుడు భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అనుష్క కి హ్యాపీ బర్త్ డే చెబుతుంది తెలుగు మిర్చి డాట్ కం.

NO COMMENTS