అనుష్క షాకింగ్ లుక్(భాగమతి)

n4d-Anushka_Shetty

స్వీటీ అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా తరుణం వచ్చింది. భాగమతి ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది. అనుష్క టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘భాగమతి’. జి.అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో అనుష్క లుక్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక చేతితో రక్తం మరక అంటిన సుత్తిని పట్టుకోగా, మరో చేయి గాయంతో కనిపించింది . ఇక అనుష్క వెనుక గోడపై చిత్రంలో కాళ్లకు కంకణాలు, మెట్టెలు ధరించిన ఓ మహిళ కాళ్లను గొలుసులతో బంధించిన దృశ్యం కనిపిస్తోంది. మొత్తమ్మీద ఈ లుక్ తెగ ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది.
యూవీ క్రియేషన్ బ్యానర్ లో ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత అనుష్క నటించిన చిత్రం కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతుంది.

NO COMMENTS