‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ (ఎం.సి.ఎ) స్టొరీ లీక్

n4d-mca-naani

ప్రస్తుతం నాని, దిల్ రాజు-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లోని ఎం.సి.ఎ. చేస్తున్నాడు. ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ అనేది ట్యాగ్ లైన్. మొదట ఇది ఒక కాలేజీ లవ్ స్టొరీ అని వినిపించింది. కానీ ఇది పక్కా ఫ్యామిలీ డ్రామానట. ఈ సినిమా స్టొరీ పై చిన్న లికేజీ వచ్చింది. ఇందులో మిడిల్ క్లాస్ మరిది పాత్రలో నాని కనిపిస్తాడట. నానికి వదినగా భూమిక కనిపించనుంది.
వదిన ఆర్టీవో అధికారిగా పనిచేస్తుందట. నాని ఏమో గాలికితిరుగుతుంటాడు. వదినకూ మరిదికీ ఒక్క క్షణం కూడా పడదట. మరిదిని ఎప్పుడూ చిన్న చూపు చూస్తుంటుందట వదిన. అయితే అనుకోకుండా వదిన ఓ సమస్యలో ఇరుక్కోవడం.. ప్రాణాలకు లెక్క చేయకుండా వదిన కోసం మరిది నిలబడటంతో ఈ మరిది గొప్పదనం తెలుసుకుంటుందట. అయితే వినడానికి ఇది సింఫుల్ గా వున్న ట్రీట్ మెంట్ చాలా కొత్త ఉటుందని చెబుతున్నారు. సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్. అన్నట్టు ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. డిసెంబర్ 15 న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది.

NO COMMENTS