పాలిటిక్స్ ను టచ్ చేస్తున్న నందమూరి హీరో (కళ్యాణ్ రామ్ )

n4d-kalyanram

కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యంఎల్‌ఏ: మంచి లక్షణాలున్న అబ్బాయి అనేది ట్యాగ్ లైన్. ఉపేంద్ర మద్వానీ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్‌లో జోరుగా సాగుతుంది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ ఎన్నికల రణరంగంలోకి దిగుతాడని తెలిసింది. అందులో భాగంగానే ఎన్నికల నేపథ్యంలో అదిలాబాద్‌ పరిసరాల్లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన పార్టీ గుర్తు ట్యాప్‌ అని సమాచారం. మొత్తంమ్మీద కళ్యాణ్ రామ్ నుండి ఓ పొలిటికల్ డ్రామా రావడం విశేషమే.
ఇందులో ‘. కాజల్‌ హీరోయిన్ . కళ్యాణ్ రామ్ తో కలసి కాజల్ లక్ష్మి కళ్యాణం సినిమా చేసిన సంగతి తెలిసిందే. కాజల్ కు ఇదే మొదటి సినిమా. ఇప్పుడు మరోసారి కళ్యాణ్ రామ్ తో కలసి నటిస్తుంది కాజల్. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.వచ్చే ఏడాది మొదట్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

NO COMMENTS