ఓటేస్తూ ప్రభుత్వ ఉద్యోగి బ్యాలెట్‌ బాక్స్‌తో సెల్ఫీ

n4d-voting_machine

ఓటు క్యాన్సిల్‌ చేసిన అధికారులు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో గురువారం శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓ ప్రభుత్వ ఉద్యోగి బ్యాలెట్‌ బాక్స్‌ ముందు సెల్ఫీ దిగడం చర్చనీయాంశంగా మారింది.
మండి ప్రాంతానికి చెందిన కమలేశ్‌ కుమార్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్ట్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇదే ప్రాంతంలో పోలింగ్‌ డ్యూటీ వేశారు. అయితే డ్యూటీకి వెళ్లేముందు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన కమలేశ్‌ బ్యాలెట్‌ బాక్స్‌తో సెల్ఫీ దిగాడు. అంతటితో ఆగకుండా దానిని వాట్సాప్‌లో షేర్‌ చేశాడు. ఏ గుర్తుకు ఓటేశాడో స్పష్టంగా తెలుస్తుండడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ఓటును రద్దు చేసి పోల్‌ డ్యూటీ నుంచి తొలగించారు.
అధికారులు కమలేశ్‌కి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అయితే కమలేశ్‌ లాంటి ఉపాధ్యాయులు ఎందరో బ్యాలెట్‌ బాక్సుల ముందు సెల్ఫీలు దిగుతుంటారని కొందరు వ్యక్తులు అధికారులకు వెల్లడించారు. ఈ సెల్ఫీలను ఒక్కోసారి పోటీ చేస్తున్న నేతలకు చూపించి తమకు నచ్చిన పోలింగ్‌ స్టేషన్లలో డ్యూటీలు వేయించుకుంటుంటారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

NO COMMENTS