అమరావతి: ఏపీ అసెంబ్లీ, మండలిలో రెండు రోజుల్లో పదవుల భర్తీ

n4d-Chandrababu-Naidu

అమరావతి: ఏపీలో పదవుల భర్తీ మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతి శాసన సభ, మండలిలోని పదవుల భర్తీపై ఇప్పటికే చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. అయితే ఒకట్రోండు రోజుల్లో చీఫ్ విప్, విప్‌ల పదవులు భర్తీ పూర్తి కానుంది. మండలి ఛైర్మన్ పదవికి సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మండలి ఛైర్మన్‌గా ఎన్.ఎం.డి ఫరూక్ పేరును ఇప్పటికే బాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే మండలిలో చీఫ్ విప్, ముగ్గురు విప్‌లను భర్తీ చేసే అవకాశం ఉంది. దీంతో మండలి చీఫ్ విప్ రేసులో టీడీ జనార్దన్, వైవీబీ రాజేంద్ర ప్రసాద్, రామ సుబ్బారెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే విప్ పదవుల రేసులో బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, అన్నం సతీష్, అంగర, సంధ్యారాణి ఉన్నారు. శాసన సభ చీఫ్ విప్ రేసులో పల్లె రఘునాధ రెడ్డి, బోండా ఉమ, కాగిత వెంకటరావు ఉన్నారు.
చీఫ్ విప్ రేసులో ఉన్న కడప జిల్లాకు చెందిన నేత, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గతంలో ఏ పదవీ లేదని అలకబూనిన విషయం తెలిసిందే. అంతేకాదు ఒకనొక సందర్భంలో ఆయన పార్టీ వీడతారని కూడా పుకార్లు వినిపించాయి. మరి రామసుబ్బారెడ్డికి ఈ పదవి అయినా దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.!

NO COMMENTS