శ్రీవారి సేవలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె

n4d-deepika

తిరుమల: బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె శుక్రవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆమెకు దర్శనం అనంతరం తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ప్రస్తుతం దీపిక పద్మావతి చిత్రంలో నటిస్తున్నారు. సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్‌ 1న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

NO COMMENTS