బోటు ప్రమాదంపై సీపీఐ నారాయణ స్పందన

n4d-narayana

విజయవాడ: కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ప్రమాదంపై ఆయన వీడియో బైట్ విడుదల చేశారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. నిన్న జరిగిన ప్రమాదంలో తన బావమరిది భార్య, కోడలు, మనవరాలు మరణించారని చెప్పారు. తన బంధువులతో పాటు, ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బోటు ప్రమాదం జరగడానికి ప్రభుత్వ అజాగ్రత్త కారణమని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా బోట్లు ఎలా తిరుగుతున్నాయని, ఒకవేళ అనుమతి ఇచ్చినట్లైతే తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి.. సింగపూర్, మలేషియా అని తిరుగుతూ, టూరిజం అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ఇకనైన ప్రభుత్వ పెద్దలు భ్రమల్లో నుంచి బయటికి రావాలని, ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని నారాయణ డిమాండ్ చేశారు.

NO COMMENTS