‘మహారాజ మార్తాండ వర్మ’గా రాబోతున్న రానా!

n4d-Rana

హైదరాబాద్‌: ‘భల్లాలదేవ’గా అదరగొట్టిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు ‘మహారాజ మార్తాండ వర్మ’గా ప్రేక్షకులను అలరించబోతున్నారు. కేరళలోని ట్రావన్‌కోర్‌ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్‌ మార్తాండ వర్మ జీవితాధారంగా ఓ చిత్రం రాబోతోంది.
ఇందులో మార్తాండ వర్మగా రానా నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ”అనిళం తిరునాళ్‌ మార్తాండ వర్మ- ది కింగ్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌’ చిత్రంతో రాబోతున్నాను. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి కె.మధు దర్శకత్వం వహించనున్నారు. రాబిన్‌ తిరుమల కథ అందించారు.’ అని రానా ట్వీట్‌లోపేర్కొన్నారు.
ప్రస్తుతం రానా ‘1945’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సత్య శివ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్‌లో రానా పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో రానా శాస్త్రవేత్తగా నటిస్తున్నట్లు చిత్రవర్గాల సమాచారం. రెజీనా కథానాయికగా నటిస్తోంది.

NO COMMENTS