ప్రేమించలేదని ఫ్యామిలీ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు, లేడీ టెక్కీ మృతి, తల్లి, సోదరి ! (చెన్నై)

n4d-marutha

చెన్నై: వెంటపడుతున్నా ప్రేమించలేదని పగతో రగిలిపోయిన ఓ యువకుడు లేడీ టెక్కీ, ఆమె కుటుంబ సభ్యుల మీద పెట్రలో పోసి నిప్పంటించిన దారుణ ఘటన చెన్నై నగరంలో జరిగింది. ఇందుజా అనే యువతి అగ్నికి ఆహుతి అయ్యింది. ఇందుజా తల్లి రేణుక 50 శాతం, ఆమె సోదరి నివేదిత 25 శాతం కాలిపోయి చెన్నైలోని కేఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చెన్నైలోని అందాబక్కంలో నివాసం ఉంటున్న ఇందుజా, అశోక్ అనే యువకుడు ఒకే కాలేజ్ లో ఇంజనీరింగ్ చదువుకున్నారు. అశోక్ ఉద్యోగం సంపాధించడం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇందుజా ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరింది. కొంత కాలంగా అశోక్ ఇందుజా వెంటపడుతూ తనను ప్రేమించాలని వేధించాడు.
ఇందుజా మాత్రం నిన్ను ప్రేమించనని, పెద్దలు చూసిన సంబంధం చేసుకుంటానని అశోక్ కు గట్టిగా చెప్పింది. అశోక్ వేధింపులు ఎక్కువ కావడంతో నెల రోజు నుంచి ఇందుజా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటిలో ఉంటున్నది. సోమవారం రాత్రి అశోక్ అందాబాక్కంలోని ఇందుజా ఇంటి దగ్గరకు వెళ్లి తనను ప్రేమించాలని బయట నుంచి గట్టిగా కేకలు వేశాడు.
ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇందుజా, ఆమె కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఒక్క సారి తలుపులు తీస్తే మాట్లాడి వెళ్లిపోతానని అశోక్ నమ్మించాడు. తలుపు తీసిన వెంటనే అశోక్ క్యాన్ లో వెంట తీసుకెళ్లిన పెట్రోల్ ఇందుజా, ఆమె సోదరి నివేదిత, తల్లి రేణుక మీద పోసి నిప్పంటించి పరారైనాడు.
మంటలు తట్టుకోలేక ముగ్గురు కేకలు వెయ్యడంతో స్థానికులు మంటలు అదుపుచేసి ముగ్గురిని కేఎంసీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఇందుజా చికిత్స విఫలమై మంగళవారం మరణించింది. ఇందుజా సోదరుడు విదేశాల్లో ఉన్నాడని వారి బంధువులు చెప్పారు. ఇందుజా అన్న ఇంటిలో లేడని తెలుసుకున్న అశోక్ ఈ దారుణానికి పాల్పడ్డాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

NO COMMENTS