మెట్రోరైలు…. హాయిగా షికారు పోదామా ? !

n4d-metro-train

హైదరాబాదీయుల చిరకాల స్వప్నం సాకారమైంది. భాగ్యనగర మెట్రోరైలు సర్వీసులు బుధవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నిజం చేసుకునేందుకు భాగ్యనగర వాసులు ఉత్సాహం చూపించారు. ఉదయం నుంచే అన్ని మెట్రోస్టేషన్లకు పెద్దయెత్తున చేరుకున్న ప్రజలు మెట్రోరైలు ఎక్కేందుకు పోటీ పడ్డారు. తమ తొలి ప్రయాణ జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు సెల్ఫీలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు
మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నడవనున్నాయి. రెండు మార్గాల్లో పది చొప్పున మొత్తం 20 రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రతీ పదిహేను నిమిషాలకో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. మెట్రో రైలుకు మొత్తం మూడు కోచ్‌లు ఉండగా ఒక్కో దాంట్లో దాదాపు 330 మంది వరకు ప్రయాణించే వీలుంది. అంటే ఒకేసారి వెయ్యి మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ లెక్కన రోజుకు మూడు లక్షమంది వరకు ప్రయాణిస్తారని అంచనా. ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల ట్రిప్పులు పెరిగే, తగ్గే అవకాశాలున్నాయి.

NO COMMENTS