కొత్తగా మెట్రో స్టేషన్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..

n4d-metro_traffic

మెట్రో వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ఆశ పడ్డ హైదరాబాద్ నగర వాసులకు కొత్త ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి..అవే మెట్రో స్టేషన్ల వద్ద ట్రాఫిక్‌ కష్టాలు. అవును ఎంతో సుందరంగా మెట్రో స్టేషన్ లు ఏర్పాటు చేసారు కానీ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయకపోయేసరికి తమ వాహనాలన్నీ కూడా రోడ్ల పైనే పెట్టడం తో కొత్త ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ వద్ద గురువారం వాహనాలను ఇష్టమొచ్చినట్టుగా పార్క్‌ చేయడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.
ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను అక్కడి నుంచి తరలించారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే అమీర్‌పేట స్టేషన్‌లో పార్కింగ్‌ వసతి కల్పించకపోవడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ట్రాఫిక్ పోలీసులు సైతం నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపి ఉంచడం తో వాటిని స్టేషన్ కు తరలించడం తో వాహనదారులు మండిపడుతున్నారు.
పరేడ్‌ గ్రౌండ్‌, సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ సౌకర్యం లేదు. నాగోల్, ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ, హబ్సిగూడ, తార్నాక స్టేషన్లలో ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉండగా.. కార్లు, బస్సులు, క్యాబ్స్‌ నిలిపేందుకు స్థలం లేదు. కొన్ని స్టేషన్లలో నిర్మాణ పనులు ఇంకా జరుగుతుండటంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది.

NO COMMENTS