రెండు సెల్ఫీ కెమెరాలతో మైక్రోమాక్స్‌ కాన్వాస్‌ ఫోన్‌

n4d-micromax

దిల్లీ: విదేశీ బ్రాండ్లు ముఖ్యంగా చైనా ఫోన్లకు దీటుగా స్వదేశంలో మార్కెట్‌ను విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది దేశీయ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ మైక్రోమాక్స్‌. ఇందులో భాగంగానే అందుబాటు ధరల్లో సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా ఈ సంస్థ ‘కాన్వాస్‌ ఇన్ఫినిటీ ప్రో’ పేరుతో సరికొత్త మోడల్‌ ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ. 13,999గా నిర్ణయించింది. 18:9 నిష్పత్తిలో ఫుల్‌ ఎడ్జ్‌ డిస్‌ప్లేతో పాటు.. రెండు సెల్ఫీ కెమెరాలు ఈ ఫోన్‌ ప్రత్యేకం. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
మైక్రోమాక్స్‌ కాన్వాస్‌ ఇన్ఫినిటీ ప్రో ఫీచర్లు
* 5.7 అంగుళాల తెర
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* ముందువైపు 20మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్‌తో రెండు కెమెరాలు
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ సదుపాయం
* ఆండ్రాయిడ్‌ నూగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌

NO COMMENTS