‘ఎం సి ఎ’ గురించి టెన్షన్ పడుతున్న దిల్ రాజ్ ?

n4d-MCA

నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది 6 సినిమాలు నిర్మించాడు అంటే అతడి గుండె ధైర్యం ఏస్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫెయిల్యూర్స్ ను లెక్కచేయకుండా ఎప్పుడూ నవ్వుతు ఉండే దిల్ రాజ్ ముఖంలో టెన్షన్ అన్నది కనిపించదు. అటువంటి దిల్ రాజ్ నాని ‘ఎం సి ఎ’ గురించి టెన్షన్ పడుతున్నాడు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

వివాదాలకు దూరంగా ఉండే దిల్ రాజ్ అందరి టాప్ హీరోలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉంటాడు. అటువంటి దిల్ రాజ్ కు ఎప్పుడూ లేనివిధంగా అక్కినేని కాంపౌండ్ తలనొప్పి మొదలైంది. కొన్ని ఇగోల కారణంగా అఖిల్ సినిమాకు నాని సినిమాకు పోటీ ఏర్పడింది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘ఎంసిఎ’ సినిమా ఈనెల 21న విడుదలకు రెడీ అవుతున్నా ఈసినిమాకు రావాల్సినంత బజ్ రావడంలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోపక్క దీనికి పోటీగా వస్తున్న హల్లో సినిమా పబ్లిసిటీలో దూసుకుపోతోంది. నాగార్జున అన్నీ తానై ఆ సినిమాకు బజ్ తీసుకురావడానికి తెగ కష్టపడుతున్నాడు. దీనికితోడు ‘హలో’ ఆడియోకు ‘ఎంసిఎ’ ఆదియోకన్నా మంచి మార్కులు పడుతున్నాయి. దీనితో ‘ఎంసిఎ’ పాటలలోని ఒక పాటను రీప్లేస్ చేసి మంచి మాస్ సాంగ్ ఏదైనా జోడించడానికి వీలవుతుందా అనే డిస్కషన్స్ కూడా దిల్ రాజ్ చేస్తున్నట్లు టాక్. ఈ మేరకు దేవీశ్రీప్రసాద్ తో దిల్ రాజు మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘ఎంసిఎ’ ట్రైలర్ చూసినవారు ఈమూవీ కథ ఒక రొటీన్ కథగా ఎంటర్ టైన్మెంట్ తో ఉండబోతోంది అన్న కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ఈమధ్య రొటీన్ సినిమాలకు బదులు విభిన్నమైన కథలు ఉన్న సినిమాలకు ఆదరణ వస్తున్న నేపధ్యంలో ‘హలో’ కథలో వెరైటీ ఉంటే అది నాని ‘ఎంసిఎ’ కు శాపంగా మారుతుందా ? అన్న భయాలు ప్రస్తుతం దిల్ రాజ్ ను వెంటాడుతున్నట్లు టాక్..

NO COMMENTS