‘టెట్'(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) షెడ్యూల్‌ను ప్రకటించిన మంత్రి గంటా శ్రీనివాసరావు

n4d-srinavasarav

అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. పరీక్ష తేదీలతో సహా ఇతర షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. అర్హత గల అభ్యర్ధులు ఈనెల 18వతేదీ నుంచి 30వ తేదీ వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తులను ఈనెల 18 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు స్వీకరిస్తారు. ఆన్‌లైన్ మౌక్ టెస్ట్ జనవరి 8వతేదీన జరుగుతుంది. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇక పరీక్షలు జనవరి 17వ తేదీ నుంచి 27 వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇనిషియల్ కీ 29వతేదీన విడుదల చేస్తారు. ఫైనల్ కీ ఫిబ్రవరి 6వతేదీన ప్రచురిస్తారు. ఇక ఫైనల్ ఫలితాలు ఫిబ్రవరి 8వతేదీన విడుదల చేస్తారు.

NO COMMENTS