సెన్సేషనల్ స్టార్ గా 2017: సాయి పల్లవి

n4d-sai_pallavi

ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా ఫ్యాన్స్ ఏర్పడటం చాలా అరుదు. కానీ సాయి పల్లవి విషయంలో జరిగిపోయింది. మలయాళం ‘ప్రేమమ్’ తో సెన్సేషనల్ స్టార్ అయ్యింది సాయిపల్లవి. ఈ సినిమాని మలయాళంలో చూసి ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు మిగతా సినీ జనాలు. ఫిదాతో టాలీవుడ్ కి వచ్చింది పల్లవి. ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. అయితే ఆల్రెడీ ప్రూవ్ అయిన హీరోకి వచ్చినంత అప్లాజ్ వచ్చింది సాయి పల్లవి ఎంట్రీ సీన్ కి. ట్రైన్ ను క్యాచ్ చేయడానికి ‘భానుమతి’ పరుగెత్తుకుంటూ వస్తుంటే థియేటర్లలో విజిల్స్ పడిపోయాయి.
మలయాళ ‘ప్రేమమ్‌’ చూసి సాయి పల్లవికి ఎందుకంతగా ఫిదా అయిపోయారో, ఆమెని అంత స్పెషల్‌గా ఎందుకు చూస్తారో ఇందులో ‘భానుమతి’గా ఆమెని చూస్తే తెలిసింది. సొంత డబ్బింగ్‌తో తెలంగాణ యాసని పొల్లుపోకుండా మాట్లాడుతూ.. తెరపై నటిస్తోన్న హీరోయిన్‌లా కాకుండా మనకి బాగా తెలిసిన అమ్మాయి భానుమతిని మాత్రమే కనిపించేట్టు చేసిన సాయి పల్లవి ఆ చిత్రం సక్సెస్ లో బిగ్గెస్ట్‌ ఎస్సెట్‌. ఒక అందమైన పల్లెటూరు, అందమైన మనుషుల నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథలో.. తెలంగాణ యాస మరింత అందంగా వినిపిస్తుంది.. సాయిపల్లవి మాట్లాడుతుంటే.
సాయి పల్లవి ఇప్పడు టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్. ఆమె ఓకే అంటే చాలు. అడ్వాన్స్ లు ఇచ్చేయడానికి బోలెడు మంది నిర్మాతలు లైన్ లో వున్నారు. కానీ సాయిపల్లవి చాలా లిమిటెడ్. తనకు తానే కొన్ని షరతులు పెట్టుకుంది. కధ కధనం నచ్చితేనే సినిమా సైన్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి. దిల్ రాజు నిర్మాణంలోనే ఓ మూడు సినిమాలకు సైన్ చేసింది. ఇందులో మిడిల్ క్లాస్ అబ్బాయి ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది కాకుండా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కణం అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది సాయి.
సాయిపల్లవి ఓకే అంటే ఇప్పుడు ఆమె డైరీ మొత్తం ఫుల్ అయిపోవడం ఖాయం. కానీ మా మాత్రం చాలా సెలక్టీవ్ సినిమాలు ఎంచుకుంటూ వెళుతుంది. తనపాత్ర నచ్చితే సినిమా లేదంటే, ఎంత పెద్ద సినిమా అయినా నో చెప్పేస్తుంది సాయి. ఈ క్రమంలో మణిరత్నం సినిమా కూడా రిజెక్ట్ చేసింది. చెలియా సినిమాలో మొదట సాయి పల్లవినే అనుకున్నారు.
బేసిగ్గా సాయి పల్లవి హీరోయిన్ అవుదామని అనుకోలేదు. సాయి పల్లవి మంచి చదువరి. విదేశాల్లో మెడిషన్ పూర్తి చేసింది. కార్డియాలజీ చదవాలనే కోరిక ఉంది. ఐతే అనుకోకుండా ప్రేమమ్ ఆఫర్ వచ్చింది. కట్ చేస్తే క్రేజీ హీరోయిన్ అయిపోయింది. అంతకుముందు ఆమె మంచి డ్యాన్స్ కూడా చాలా డాన్స్ రియాలిటీ షోలు చేసింది. ఆమె డ్యాన్స్ కి స్పెషల్ గా ఫ్యాన్స్ వున్నారు. అన్నట్టు.. ఇంకో విషయం సాయి పల్లవి మొదట సినిమా ప్రేమమ్ అనుకుంటారు చాలా మంది. కాదు. ‘ధాం ధూమ్’ అనే ఓ తమిళ సినిమా చేసింది సాయి పల్లవి. పీసీ శ్రీరాం, మనికంధన్, జీవా లాంటి ప్రముఖులు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇందులో పేరు లేని పాత్రలో కనిపించింది సాయి పల్లవి. అ తర్వాత చదువు కోసం విదేశాలు వెళ్ళిపోయింది. కట్ చేసే ప్రేమమ్ తో పాపులరై 2017లో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది సాయిపల్లవి.

NO COMMENTS