నెక్లెస్‌రోడ్‌లో కొలువుదీరిన ‘లవ్‌ హైదరాబాద్‌’ చిహ్నం

n4d-hydrabad

హైదరాబాద్‌: పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘లవ్‌ హైదరాబాద్‌’ చిహ్నం నెక్లెస్‌రోడ్డులో కొలువుదీరింది. గతంలో ఈ చిహ్నం ట్యాంక్‌బండ్‌పై ఉండేది. అయితే పర్యాటకులు, నగరవాసులు తమ వాహనాలు రోడ్డుపైనే ఆపి దాని వద్ద ఫోటోలు తీసుకునేందుకు ఎగబడటంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తేవి. దీంతో ఆ చిహ్నాన్ని అక్కడ్నుంచి తొలగించి నెక్లెస్‌రోడ్‌లో నెలకొల్పాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఎలాంటి ట్రాఫిక్‌కు అంతరాయం లేని ప్రదేశమైన నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా పక్కన క్రేన్‌ సాయంతో నెలకొల్పి దానికి రంగులు అద్దుతున్నారు.

NO COMMENTS