సవ్యసాచి లో చైతు , మాధవన్..

n4d-chithu

అక్కినేని నాగ చైతన్య – చందు మొండేటి కాంబినేషన్ లో సవ్యసాచి మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఇటీవలే పెళ్లి తర్వాత చైతు ఈ మూవీ సెట్ లో జాయిన్ అయ్యాడట. ప్రస్తుతం సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ మూవీ లో మాధవన్ , చైతు ల మధ్య సాగే సన్నివేశాలు హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఇందులో మాధవన్ ది నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్ర అట..చైతు , మాధవన్ ఇద్దరు కూడా నువ్వా నేనా..అనేంతలా ఉంటాయని అంటున్నారు.ఇందులో నాగ చైతన్య పాత్రకు కొన్ని ప్రత్యేక శక్తులు కూడా ఉంటాయని తెలుస్తోంది. మరి ఆ శక్తులు ఏంటా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. ఇక ఈ మూవీ లో చైతు కు జోడిగా బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ నటిస్తుండగా , మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీ ని నిర్మిస్తుంది. ఈ మూవీ తర్వాత చైతు మారుతీ దర్శకత్వం లో శైలజారెడ్డి అల్లుడు అనే మూవీ చేయనున్నాడు.

NO COMMENTS