విజయనగరం వనుంపేటలో భారీ అగ్నిప్రమాదం

n4d-fire

విజయనగరం: జిల్లాలోని భోగాపురం పంచాయతీ వనుంపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో 15 ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకుని 70 మేకలు మృతి చెందాయి. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కాగా ప్రాణనష్టం ఎంత జరిగిందన్న విషయంపై స్పష్టత రాలేదు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఫైరింగ్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

NO COMMENTS