అమెరికాలోని వాషింగ్టన్ లో రైలు ప్రమాదం.. వంతెనపై నుంచి జారి..

n4d-America

అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించగా..సుమారు 100 మంది గాయపడ్డారు. వాషింగ్టన్ సమీపంలోని డుపోంటన్ నగర సరిహద్దుల్లో ఈ రైలు పట్టాలు తప్పి వంతెనపై నుంచి జారి హై వే మీద పడింది.

ఈ దుర్ఘటనలో రైలు ప్రయాణికులు, రోడ్డుపై వాహనాలపై వెళ్తున్న కొందరు కూడా గాయపడ్డారు. కొన్ని వాహనాలు నుజ్జు నుజ్జుయ్యాయి. సియాటెల్ నగరం నుంచి పోర్ట్ లాండ్, ఓరేగాన్ నగరాలను కలుపుతూ హై స్పీడ్ సర్వీసు రైలును ప్రారంభించిన రోజే ఈ ఘటన జరిగింది.
ప్రమాద సమయంలో ఈ ట్రైన్ గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

NO COMMENTS