‘భాగమతి’ టీజర్‌ , భయపెడుతున్న అనుష్క..!

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భాగమతి’. జి.అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ ఈరోజు విడుదలైంది. అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లో అనుష్కభయంకరమైన గెటప్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పుడు టీజర్‌లో.. ఓ కోటను చూపిస్తూ అందులో ఓ వ్యక్తి కాలు పెట్టగానే వస్తువులు కదులుతున్నట్లు చూపించారు. అనుష్క తన చేతిని తానే సుత్తితో కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉన్ని ముకుందన్‌, ఆది పినిశెట్టి, జయరాం, ఆశా శరత్‌ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రం తర్వాత అనుష్క ఇలాంటి థ్రిల్లర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

NO COMMENTS