జీ ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సమంత

n4d-samantha

ఇటీవలే నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న సమంత , ప్రస్తుతం పెళ్లి కి ముందు ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది. వాటితో పాటు తాజాగా ఓ టీవీ ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడానికి సైన్ చేసింది. ప్రముఖ జీ ఛానల్ వారు తమ ఛానెల్ అంబాసిడర్ గా సమంత ను తీసుకున్నారు. ఈ మేరకు ఆమెతో అగ్రిమెంట్ కూడా పూర్తి చేశారట. దీనికి గాను అమ్మడు కోటి 50 లక్షల రూపాయలు పారితోషకం తీసుకుందని తెలుస్తుంది.

ఒప్పందం ప్రకారం ఛానెల్ లో పలు సీరియళ్లు, సినిమాలకు ప్రచారం కల్పించబోతోంది సమంత. ఆమెపై షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. లేటెస్ట్ గా విడుదలైన సమంత మోడ్రన్, ట్రెడిషనల్ లుక్స్ పిక్స్ ఆ యాడ్ లోనివేనట. ఇంతకు ముందు తమన్నా ఈ ఛానల్ కు అంబాసిడర్ గా ఉంది. ఆమెతో చేసుకున్న ఒప్పందం పూర్తి కావడం తో ఇప్పుడు సమంత ను తీసుకున్నారు.
ప్రస్తుతం సమంత రంగస్థలం, మహానటి సినిమాలు చేస్తోంది. వీటితో పాటు తమిళ్ లో కూడా రెండు సినిమాలు చేస్తూ, రెండు యాడ్ లలో కూడా నటిస్తుంది. ఇవి పూర్తి అయిన తర్వాత తనే నిర్మాతగా ఓ సినిమా ప్లాన్ చేస్తుంది ఈ అమ్మడు. మొత్తానికి సమంత పెళ్లి తర్వాత కూడా బాగా బిజీ అయిపొయింది.

NO COMMENTS