మళ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర కళ వచ్చింది (ఎంసిఏ, హలో) తో…

n4d-movie

గత రెండు నెలలుగా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు లేక బోసిపోయింది..ఈ రెండు నెలల్లో దాదాపు 50 సినిమాలకు పైగానే విడుదల అయ్యాయి. కానీ ఇవేమి కూడా సగటు ప్రేక్షకుడిని థియేటర్స్ కు రప్పించలేకపోయాయి. నవంబర్ 3 న గరుడ వేగ చిత్రం వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత వారానికి 10 , 12 సినిమాలు వచ్చాయి కానీ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ అన్నాయి. ఈ టైం లో నిన్న వచ్చిన ఎంసిఏ , ఈరోజు రిలీజ్ అయినా హలో చిత్రాలతో మళ్లీ బాక్స్ ఆఫీస్ దగ్గర కళ వచ్చింది.
అగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ అయితే ఎలా సందడి ఉంటుందో..ఆ రేంజ్ లో ఈ రెండు సినిమాలకు జనాలు క్యూ కట్టారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నుండి సినిమా అనగానే అభిమాని దగ్గరి నుండి సాధారణ ప్రేక్షకుడు వరకు థియేటర్స్ కు పరుగులు పెట్టారు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ సాధించినట్లు తెలుస్తుంది. ఇక అఖిల్ నటించిన హలో మూవీ ఈరోజు గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ మూవీ కి కూడా మంచి ఓపెనింగ్స్ లభించినట్లు తెలుస్తుంది.

ఓవరాల్ గా ఈ రెండు చిత్రాలతో బాక్స్ ఆఫీస్ కళకళలాడుతుంది.

NO COMMENTS