వైభవంగా వైకుంఠ ఏకాదశి (తిరుమలకు భక్తులు పోటెత్తారు)

n4d-Tirumala

నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి సుమారు 4 కిలోమీటర్ల పొడవున క్యూ కట్టారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా తిరువేంకటనాథుడి దర్శనం కోసం గోవింద నామ స్మరణ చేసుకుంటూ వేచి చూస్తున్నారు

NO COMMENTS