ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)గురించే ఎక్కువ వెతికారట

n4d-Cricketbatch

దిల్లీ: మనకు తెలియని లేదా మనకు కావాల్సిన సమాచారం కోసం ఎక్కువగా ఆశ్రయించేది గూగుల్‌నే. ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువ మంది భారత క్రీడాభిమానులు శోధించింది దేని గురించో తెలుసా! ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. అదేనండీ ఐపీఎల్‌. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దేశ విదేశాలకు చెందిన క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతూ బౌండరీల మోత మోగిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అలాగే మన దేశంలో క్రికెట్‌కు ఉన్న అభిమానులు మరో క్రీడకు ఉండరేమో. అందుకే ఏ ఏడాది గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ఎక్కువ మంది భారతీయులు శోధించిన టాప్‌-10 అంశాలకు సంబంధించిన డేటాను విడుదల చేశారు. ఈ జాజితాలో ఐపీఎల్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ రెండో స్థానంలో నిలిచింది. టాప్‌-10లో నిలిచిన స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ ఏంటో చూద్దాం 1. ఐపీఎల్‌ 2.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 3. వింబుల్డన్‌ 4. డబ్ల్యూడబ్ల్యూ రెజిల్‌మేనియా 5. ప్రొకబడ్డీ 6.

యూఎస్‌ ఓపెన్‌ 7. ఫిఫా వరల్డ్‌ కప్‌ 8. రాయల్‌ రంబుల్‌ 9. ఐసీసీ ఉమెన్స్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 10.

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌. ఈ ఏడాది ట్రెండింగ్‌లో నిలిచిన అంశాల్లోనూ ‘ఐపీఎల్‌’ రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని ‘బాహుబలి-2’ దక్కించుకుంది.

NO COMMENTS