వాషింగ్టన్: పనిచేయని కంప్యూటర్లు 2 గంటల పాటు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకుల నిరీక్షణ

n4d-airport

వాషింగ్టన్: అమెరికాలోని పలు విమానశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ కంప్యూటర్లు రెండు గంటల పాటు పనిచేయలేదు.దీంతో ఎయిర్‌పోర్టుల్లోనే ప్రయాణీకులు గంటల కొద్దీ ఎదురు చూడాల్సి వచ్చింది. అమెరికాలోని పలు ఎయిర్‌పోర్టుల్లో సోమవారం నాడు ఈ పరిస్థితి ఎదురైంది.

నూతన సంవత్సర వేడుకలను ముగంచుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న ప్రయాణీకులకు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రాసెసింగ్ సిస్టమ్‌లో రెండు గంటల పాటు సాంకేతిక సమస్యలు తలెత్తాయని ప్రకటించింది.

సాధారణం కంటే అధిక సమయాన్ని ఎయిర్ పోర్టుల్లోనే గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ప్రయాణీకులు చెప్పారు. అయితే ఈ అంతరాయానికి గల కారణాలను మాత్రం అధికారులు ప్రకటించకపోవడంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయమార్గాలను ఎంచుకొన్నారు.

న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, హార్ట్స్‌ఫీల్డ్‌ జాక్‌సన్‌ అట్లాంటాఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు వంటి ఇతర ఎయిర్‌పోర్టులు దీని ప్రభావానికి గురయ్యాయి. గతేడాది కూడా ఇధే తరహలో జరిగింది. ముందు జాగ్రత్త చర్యలను తీసుకోలేదని ప్రయాణీకులు విమర్శిస్తున్నారు.

NO COMMENTS