ముంబైలో నేడు బంద్‌ రోడ్లపై నిరసనకార్యక్రమాలు…!

n4d-mumbai

ముంబై: దళిత నేత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మనవడైన ప్రకాష్‌ అంబేద్కర్‌ పై మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సిట్టింగ్‌ హై కోర్టు జడ్జితో విచారణకు ఆదేశించడంతో పలువురు కార్యకర్తలు ముంబైలో బంద్‌కు పిలుపునిచ్చారు. రోడ్లపై నిరసనకార్యక్రమాలు చేపట్టడంతో స్కూలు బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా 250 దళిత సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. పూణె సమీపంలో భీమ- కొరెగాన్‌ వద్ద ఆంగ్లో మరాఠా యుద్ధం 200వ వార్షికోత్సవం సందర్భంగా స్ధానిక రైట్‌ వింగ్‌ సంస్థలకు, దళితులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో ఒక యువకుడు మృతిచెందగా, 12మందిదాకా గాయపడ్డారు. 160 బస్సులు పూర్తిగా ధ్వంసమైన సంగతి తెలిసిందే.

NO COMMENTS