అమెరికాలో బాంబ్‌ తుపాను

n4d-america

వాషింగ్టన్‌: అమెరికాలో బాంబు తుపానుకు 11 మంది బలయ్యారు. ఎముకలు కొరికే చలితో అమెరికా తూర్పు ప్రాంతం వణికిపోతోంది. అమెరికాలోని 24 తీర ప్రాంతాల్లో తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో నీరు గడ్డ కట్టిపోతోంది. నయాగరా జలపాతం కూడా గడ్డకట్టుకుపోయింది. బాంబ్‌ తుపాను గురువారం మరింత విరుచుకుపడనుందని వెల్లడించారు. అమెరికా ఈశాన్య ప్రాంతంలో 6 నుంచి 12 అంగుళాల మేర మంచు పడుతోందని, గంటకు 64 నుంచి 96 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది.

NO COMMENTS