చంద్రబాబుకు జగన్ చురకలు

n4d-jaganmohan

చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆయన పాదయాత్ర సోమవారానికి 56వ రోజుకు చేరుకుంది. మొరవపాటూరు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కొండారెడ్డిపల్లి క్రాస్ నుంచి తలుపులపల్లి, తిమ్మిరెడ్డిపల్లి, తోటలోపు, టీ రంగం మీదుగా సాగుతుంది.

అక్కడి నుంచి రంగంపేట క్రాస్ చేరుకొని పార్టీ జెండా అవిష్కరించారు. అనంతరం పూతలపట్టులో బహిరంగ సభలో మాట్లాడుతారు. అనంతరం సమనత్తం మీదుగా అనంతారం వరకు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా ఆయన 766 కిలోమీటర్లకు పైగా నడిచారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది.

వెన్నుపోట్లు
తొలినాళ్ల నుంచి మోసాలు, వెన్నుపోట్లు
పాదయాత్ర సందర్భంగా జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. తొలినాళ్ల నుంచి మోసాలు, వెన్నుపోట్ల ద్వారానే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తనకు అక్షరాలు నేర్పిన శేషాపురం పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నా, చంద్రగిరిలో 100పడకల ఆసుపత్రికి నాటి వైయస్ ప్రభుత్వం జీవో ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. సొంత ఊరు, బడి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేని చంద్రబాబు మైక్‌ పట్టుకుంటే రాష్ట్రాన్ని సింగపూర్‌ చేస్తానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
సముద్రాన్ని చిత్తూరుకు
సముద్రాన్ని చిత్తూరుకు తెస్తానంటాడు
చివరకు వినే వాళ్లు ఉంటే చిత్తూరుకు సముద్రాన్ని తెస్తానని చంద్రబాబు చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు. అలా అననందుకు సంతోషించాలన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి వాళ్లను అప్పులపాలు చేశారన్నారు. బ్యాంకుల్లో కూడా వారికి అప్పు పుట్టని దారుణ పరిస్థితిని తెచ్చిపెట్టారన్నారు. ఆయన అందిస్తున్న టెక్నాలజీ వల్ల ఫోన్‌ కొడితే మద్యం ఇంటికే వస్తోందని విమర్శించారు.
అవినీతి
మరుగుదొడ్డిలోను అవినీతి
జన్మభూమి కమిటీల మాఫియా కారణంగా పక్కా ఇళ్ల కోసం నాలుగేళ్లుగా దరఖాస్తులు చేసుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదని జగన్ అన్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్టుల్లో, ఇసుకలో, బొగ్గులో అవినీతి గురించి విన్నామని, ఇప్పుడు మరుగుదొడ్లలోనూ అవినీతిని చూస్తున్నామన్నారు. చంద్రబాబు వాడుకొని వదిలేసే రకం అన్నారు.

ఏ దేశానికి వెళ్తే అలా
ఏ దేశానికి వెళ్తే అలా అంటాడు
చంద్రబాబు లాంటి నాయకుడు మనకు అవసరమా అని జగన్ ప్రశ్నించారు. సింగపూర్ వెళ్తే సింగపూర్‌లా చేస్తానని, జపాన్ వెళ్తే జపాన్‌లా చేస్తానని.. ఇలా ఏ దేశానికి పోతే ఆ దేశంలా ఏపీని చేస్తానని అంటాడని ఎద్దేవా చేశారు. జగన్ వెంయ విజయ సాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రోజా తదితరులు ఉన్నారు.

NO COMMENTS