జ్యూయలరీ సంస్థ జోయలుక్కాస్‌పై దేశవ్యాప‍్తంగా ఐటీ దాడులు

n4d-joyalukkas

ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయలుక్కాస్‌కు ఆదాయ పన్నుశాఖ షాక్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఐడీ సోదాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో ఆదాయ ప​న్ను అధికారులు దాడి చేశారు. హైదరాబాద్‌, కేరళ, బెంగళూరు,ముంబై తదితర నగరాల్లో ఏకకాలంలో షాపులు మూసివేసి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి ఈ సోదాలు ప్రారంభించగా, షాపులు మూసేసి మరీ అధికారులు సోదాలు చేపట్టారు. తమిళనాడుతో పాటు అనేక రాష్ట్రాల్లో జ్యూయలరీ చైన్ జోయలుక్కాస్‌కు చెందిన షోరూంలలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇప్పటికి 4 లాకర్లు, 20 దస్తావేజులు, అధికారికంగా రూ.4 కోట్లు, 60 లక్షల విలువైన డాక్యుమెంట్లను అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీనియర్ ఆదాయపు పన్ను అధికారి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కాగా గల్ఫ్ దేశాలలో స్థాపించబడిన జ్యూయలరీ మేజర్‌ జోయలుక్కాస్‌ గ్రూపు ఒమన్, బహ్రెయిన్, ఇండియా, యూకే సహా 11 దేశాలలో 130 షోరూంలను నిర్వహిస్తోంది.

NO COMMENTS