‘గునుంగ్‌ అగుంగ్‌’ అగ్నిపర్వతాన్ని అధిరోహించిన సాయితేజ

saitej

హైదరాబాద్‌: ఇండోనేషియాలోని బాలీ ద్వీపంలో ఉన్న ‘గునుంగ్‌ అగుంగ్‌’ అగ్నిపర్వతాన్ని హైదరాబాద్‌కు చెందిన పెద్దినేని సాయితేజ(25) అధిరోహించారు. సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ అగ్నిపర్వత్వాన్ని ఈనెల 10న అధిరోహించారని సాయితేజ తండ్రి నాగేశ్వర్‌రావు  తెలిపారు. సుమారు 48 గంటల సమయంలోనే అధిరోహించినట్లు వివరించారు. ఎలాంటి సహాయకులు, శిక్షకుల సహకారం లేకుండానే పర్వతారోహణ చేశారని తెలిపారు. గతేడాది మేలో ఇండోనేషియాలోని దుకోణో అగ్నిపర్వతాన్ని సాయితేజ అధిరోహించి..తొలిసారి ఆ పర్వతాన్ని అధిరోహించిన భారతీయుడిగా నిలిచాడని వెల్లడించారు. సొంతంగానే ఈ సాహసయాత్ర చేపట్టారని, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు.

NO COMMENTS