మార్చిలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభం

n4d-Balakirshna

వచ్చే మార్చి నెలలో ఎన్టీఆర్ బయో పిక్ షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించాడు బాలయ్య. ఎన్టీఆర్ గురించి ప్రజలకు తెలియని అంశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని ఈ మూవీలో చూపిస్తామని ఆయన చెప్పాడు. దేశం గర్వపడేలా ఈ చిత్రం తీస్తామని తెలిపాడు. ఎన్టీఆర్ కి భారత రత్నకోసం కృషి చేస్తామని బాలకృష్ణ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ 22 వ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ ఆయనకు ఘనంగా నివాళులర్పించాడు.

ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పుడు.. తెలుగుజాతి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు.. తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలకూ చాటిన మహా వ్యక్తి అని బాలయ్య అన్నాడు. కాగా. హరికృష్ణ, ఎన్టీఆర్ మనవలు సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం తదితరులు ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించారు.

NO COMMENTS