ప్రాణంపోయేలోగా లక్ష్యాన్ని సాధిస్తా

n4d-kamalhashan

భారతదేశ గొప్పతనాన్ని చాటేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సినీ నటుడు కమల్‌ హాసన్‌ తెలిపారు. అభిమాన సంఘాలతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందుగా తమిళనాడు నుండి తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుడుతున్నానని తెలిపారు.

‘నా ప్రాణంపోయేలోగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా అనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. దేశభక్తిగల యువత తనతో కలిసి నడిచేందుకు ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చేనెల 21 నుండి తన సొంతగడ్డ రామనాధపురం నుండి యాత్రను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.

NO COMMENTS