కీర్తి సరేష్ ఇచ్చిన స్వీట్‌ సర్‌ప్రైజ్‌తో యూనిట్‌ సభ్యులు షాక్ తిన్నారు..!

n4d-kerthisuresh

తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా మాలీవుడ్ బ్యూటీల హవా బాగా పెరిగిపోయింది. నయనతార, నిత్యా మీనన్ ఇలా ఎంతో మంది నటీమణులు తెలుగు ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. తాజాగా ‘నేను లోకల్’ చిత్రంతో అందాల భామ కీర్తి సురేష్ మంచి క్రేజ్ సంపాదించింది. ఈ చిత్రం తర్వాత తమిళ, మళియాళ, తెలుగు ఇండస్ట్రీలో బిజీ యాక్టర్ గా మారు. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ తమిళనాట స్టార్ హీరోల సరసన నటిస్తుంది.
ప్రస్తుతం ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ నేపథ్యంలో ‘మహానటి’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రాధాన పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తుంది. ‘మహానటి’ చిత్రంలో సమంత, దుల్కన్ సల్మాన్, అర్జున్ రెడ్డి, మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్ ఇలా ప్రముఖులు నటిస్తున్నారు.
సాధారణంగా హీరో, హీరోయిన్లు తమ సినిమా బాగా సక్సెస్ అయితే తమ వద్ద ఉండే సిబ్బందికి ఎదో ఒక కానుక ఇస్తుంటారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ‘మహానటి ‘ షూటింగ్ బిజీలో ఉంది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సావిత్రికి తన సినిమాకు పని చేసిన వారికి బహుమతులు ఇవ్వటం అలవాటు.
ఆ అలవాటు సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కొనసాగించింది.కీర్తి ఇచ్చిన స్వీట్‌ సర్‌ప్రైజ్‌తో యూనిట్‌ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు..ఎందుకో తెలుసా..ఆ స్వీట్ ప్యాకెట్ లో ఓ బంగారు కాయిన్ కూడా ఉంది. దాదాపు 100 మందికి గోల్డ్‌ కాయిన్‌ బహుమతిగా ఇచ్చారని సమాచారం. 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకూ ఆ కాయిన్‌ ఉంటుందట. 100 కాయిన్స్‌ అంటే 25 లక్షల వరకూ ఖర్చు పెట్టి ఉంటారు కీర్తి.

NO COMMENTS