రికార్డ్ దిశగా దూసుకుపోతున రంగస్థలం టీజర్‌

n4d-charan

‘నాపేరు చిట్టిబాబండీ.. ఈ ఊరికి మనమే ఇంజినీరు. అందరికీ సౌండ్ వినపడుద్దండీ.. నాకు కనపడుద్దండీ!. అందుకే ఊళ్లో మనల్ని అందరూ సౌండ్ ఇంజినీరు అంటారు. మా ఊరు…’ అంటూ టీజర్‌లో చరణ్ చెప్పే డైలాగ్స్‌కి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్. 1985 కాలం నాటి స్థితిగతులను ప్రతీ ఫ్రేమ్‌లోనూ చక్కగా చూపించారు. ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటిస్తోంది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది. నిన్న సాయంత్రం 4:15గంటలకు విడుదలైన టీజర్ కొన్ని గంటల్లోనే 7.5 మిలియన్ డిజిటల్ వ్యూస్‌ను రాబట్టడం విశేషం.

NO COMMENTS