కోటి ఫాలోవర్స్‌తో కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసిన బన్నీ

సౌత్‌ సోషల్‌ నెట్‌వర్క్‌లో టాప్‌స్టార్‌ అంటే.. రజనీనో, మహేష్‌బాబో, పవన్‌ కళ్యాణో, అజిత్‌, విజయ్‌, చిరంజీవినో, మమ్ముట్టి, మోహన్‌లాలో అనుకుంటే పొరపాటే. కానీ, వాళ్లందరి కంటే.. ముందుగా.. ఫేస్‌బుక్‌లో టాప్‌ స్టార్‌గా అల్లువారబ్బాయి.. చేరిపోయాడు. కోటి ఫాలోవర్స్‌తో కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు బన్నీ.

బన్నీ ఫేస్‌బుక్‌ పేజీని కోటి మందికిపైగా లైక్‌ చేస్తున్నారు. రోజూ బన్నీ ఎలాంటి అప్‌డేట్ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఒక్క లైక్‌.. వాళ్లకు కోటి రూపాయలు లాటరీ తగిలినట్లు ఆనందాన్ని ఇస్తోంది.. అందుకే.. ఫేస్‌బుక్‌లో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటాను అంటున్నాడు బన్నీ. మొత్తానికి బన్నీ క్రియేట్‌ చేసిన రికార్డ్‌ను.. అందుకోవటానికి సౌత్‌ హీరోలెవ్వరూ దరిదాపుల్లోనే లేరు. ఉన్నా.. ఒకరిద్దరికీ.. మరో సంవత్సరంపైనే పట్టే అవకాశాలున్నాయి అంటున్నారు బన్నీ అభిమానులు. అప్పటికి బన్నీ కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేయటం ఖాయమంటున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY